ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రీఓపెన్ డేట్ వచ్చేసింది

:విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు

2025-05-20 14:11:26 - Repalle Bazaar App

AP Schools Reopen Date: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చిన సమ్మర్ హాలిడేస్ త్వరలో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే దానిపై విద్యార్థుల్లో సందేహం నెలకొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోని సమ్మర్ హాలిడేస్ పూర్తయిన తర్వాత జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభమవుతాయని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి విద్యార్థులు ఎటువంటి సందేహం లేకుండా జూన్ 12వ తేదీ 2025 నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేటువంటి విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని విద్యాశాఖ తెలిపింది. స్కూల్స్ ప్రారంభమయ్యే తేదీల విషయంలో ఎటువంటి మార్పులు లేవని, గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీనే పునః ప్రారంభమవుతాయని తెలిపారు.

స్కూల్స్ ఓపెన్ చేసే రోజునే పుస్తకాలు :

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ చేసే రోజునే పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

More Posts